శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
డీజీపీకి సీఎం ఆదేశాలు
అధికారం కోల్పోయామన్న అక్కసుతోనే ఇదంతా అంటూ వ్యాఖ్యలు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
తెలంగాణ, హైదారాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పనవి సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీని ఆదేశించారు. అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం అన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారన్న ఆయన, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో సీరియస్‌గా వ్యవహరించాలని డీజీపీకి సూచించారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం పోలీస్ యంత్రాంగంపై సమీక్ష చేయాలని చేయాలని డీజీపీని ఆదేశించారు.
బీఆర్‌ఎస్‌లో ముదిరిన అంతర్గత విభేదాలు..
గడిచిన రెండురోజులుగా బీఆర్‌ఎస్‌లో అంతర్గత కలహాలు ముదిరిపాకాన పడ్డాయి. ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ–కౌశిక్‌రెడ్డి మధ్య జెండా వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో గురువారం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే గాంధీ అనుచరులు వెంటబెట్టుకుని అక్కడకు వెళ్లడంతో మరింత జఠిలమైంది. దీంతో ఎమ్మెల్యేల అనుచరులు ఒకరిపై మరొకరు రాళ్లు, టమాటాలతో దాడులు చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఎమ్మెల్యే గాంధీని అరెస్ట్ చేసి నార్సింగి పీఎస్‌కు తరలించారు.
కేసులు నమోదు..
ఎమ్మెల్యే అరికపూడి గాంధీతోపాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపైనా కేసు నమోదు చేశారు. నేతల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండేలా పోలీసులు చర్యలు చేపట్టారు.