రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ఎయిర్ ఫోర్స్ విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో (Begumpet Airport) ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి హాజరవుతారు.
అనంతరం మధ్యాహ్నం రాష్ట్రపతి నిలయంలో ఎనిమిది రోజులపాటు నిర్వహించే ఈశాన్య రాష్ర్టాల భారతీయ కళా మహోత్సవంను ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్‌గా మంత్రి సీతక్కను రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. రాష్ట్రపతిని స్వాగతించడం మొదలు సాగనంపడం వరకు ముర్ము వెంట మంత్రి సీతక్క ఉండనున్నారు.