AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దేవర ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా.. అధికారికంగా అనౌన్స్..

ఎన్టీఆర్ దేవర సినిమా నిన్న థియేటర్స్ లో రిలీజయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫ్యాన్స్ ని మాత్రం ఈ సినిమా మెప్పిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి అంటున్నారు ఆడియన్స్. ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా భారీగా రిలీజయింది.

తాజాగా దేవర మూవీ యూనిట్ ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించింది. దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఏకంగా 172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు ప్రకటించారు. ఎన్టీఆర్ కెరీర్లోనే ఇది అత్యధికం. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో దసరా సెలవులు వస్తుండటం, నేడు, రేపు వీకెండ్ ఉండటంతో ఈజీగా 500 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుంది దేవర అని అభిప్రాయ పడుతున్నారు.

అయితే ఇప్పటివరకు అత్యధిక గ్రాస్ సాధించిన RRR సినిమా రికార్డ్ మాత్రం సేఫ్ గానే ఉంది. RRR మొదటి రోజు 223 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా ప్రభాస్ కల్కి 191 కోట్ల గ్రాస్ తో ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఆ తర్వాత ప్రభాస్ సలార్ 178 కోట్లతో నిలవగా, ఇప్పుడు దేవర 172 కోట్లతో టాప్ లిస్ట్ లో చేరింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10