AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో దేవర మూవీ టికెట్‌ ఎంతో తెలుసా.?

ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 27న.. రిలీజ్ అవుతున్న దేవర మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. తాజాగా దేవర సినిమాకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. తెలంగాణాలో టికెట్స్ రేట్స్ ను పెంచుకునేందుకు.. దేవర టీంకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నెల 27న రాత్రి 1.00 గంటలకు 29 థియేటర్లలో అదనపు ప్రదర్శన, టికెట్ రేట్లను రూ.100 పెంపు కు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 27ఉదయం 4.00 గంటల నుండి తెలంగాణాలోని అన్ని థియేటర్లలో టికెట్ రేట్లను రూ.100 పెంచుతూ 6 ప్రదర్శనలకు అనుమతి ఇచ్చింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10