AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాపై మూడు సార్లు రేప్‌ చేశాడు.. టీడీపీ ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు.. వీడియోలను బహిర్గతం చేసిన బాధితురాలు

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే  కోనేటి ఆదిమూలం తనపై లైంగిక వేధింపులకు   గురిచేశారని బాధితురాలు సంచలన ఆరోపణలు చేసింది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలను సైతం ఆమె విడుదల చేసింది. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో భర్తతో కలిసి గురువారం వివరాలు వెల్లడించింది.

తిరుపతిలోని బీమాస్ హోటల్‌(Hotel) లో తనపై లైంగిక దాడి చేశాడని వెల్లడించింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు  తో పాటు మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కు లేఖ రాశానని తెలిపింది. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఆదిమూలం తనపై బెదిరింపులకు దిగాడని ఆందోళన వ్యక్తం చేసింది. తాము కూడా టీడీపీకి చెందిన వారిమేనని ఆ దృష్ట్యా పార్టీ కార్యక్రమాల్లో ఆదిమూలం కలిసేవారని వెల్లడించింది.

అలా పరిచయమైన తరువాత ఆదిమూలం తన ఫోన్ నెంబర్ తీసుకుని పదేపదే కాల్స్ చేసేవాడని, తిరుపతిలోని భీమాస్ హోటల్‌ రూమ్ నెంబర్ 109 లోకి రమ్మని చెప్పాడని తెలిపింది. అక్కడ తనను బెదిరించి తనపై ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. అలా తనపై మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజరూపాన్ని బట్టబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టుకున్నానని వివరించింది.

పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌
ఎమ్మెల్యే దురాగతాల సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని బాధితురాలు పేర్కొంది. ఎమ్మెల్యే వందసార్లు కాల్ చేశాడని, రాత్రులు మెసేజ్‌లు చేసి వేధించేవాడని, రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడని తీవ్రంగా ఆరోపించింది. అందమైన అమ్మాయి కనబడితే చాలు తనతో ఉండాల్సిందేనని అలా ఎంతో మందిని వేధించాడని వెల్లడించింది.

తిరుపతి భీమా ప్యారడైజ్ హోటల్ ఎమ్మెల్యే నీచ చర్యలకు అడ్డా అని తెలిపింది. ఇలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. ఆదిమూలం కామాంధుడు, రాక్షసుడని, అతని నుంచి సత్యవేడులోని పార్టీ మహిళా కార్యకర్తలను కాపాడాలని బాధితురాలు వేడుకొంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10