AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చంద్రబాబుపై సుప్రీం వ్యాఖ్యలపై మాజీమంత్రి రోజా రియాక్షన్!

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం పైన నేడు సుప్రీంకోర్టులో విచారణలో సుప్రీం ధర్మాసనం చంద్రబాబుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది . తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బిజెపి మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ లపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఈరోజు కీలక వ్యాఖ్యలు చేసింది.

చంద్రబాబుకి సుప్రీం చివాట్లు దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని, చంద్రబాబు తన వ్యాఖ్యలతో కోట్లాదిమంది భక్తుల మనోభావాలను గాయపరిచారని సుప్రీం ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. నెయ్యి కల్తీ జరిగిందని సాక్ష్యం ఉందా? నెయ్యి కల్తీ పైన సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? అంటూ సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. జూలైలో రిపోర్టు వస్తే సెప్టెంబర్ లో చెప్పారు ఎందుకు అంటూ ప్రశ్నించిన సుప్రీంకోర్టు కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా పెట్టాలని చివాట్లు పెట్టింది.

సుప్రీం వ్యాఖ్యలపై స్పందించిన రోజా అక్టోబర్ మూడవ తేదీ వరకు ఈ కేసును వాయిదా వేసింది. ఇక సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ మంత్రి రోజా స్పందించారు చంద్రబాబు పూర్తిగా తన స్వలాభం కోసం పవిత్రమైన తిరుపతి లడ్డు మీద నింద వేసి ఈరోజు శ్రీవారి భక్తులందరి మనోభిప్రాయాలను దెబ్బతీశారని, మళ్ళీ ఆ భక్తుల మనోభావాలను పునరుద్ధరించాలని దానికి సుప్రీంకోర్టు కలుగజేసుకొని కేసును స్వీకరించటం జరిగిందని పేర్కొన్నారు.

చంద్రబాబు టార్గెట్ కేవలం జగన్ ఈ కేసులో సుప్రీంకోర్టు డైరెక్ట్ గా విచారణ జరిపితే చంద్రబాబు నాయుడు అండ్ కో యొక్క అబద్ధాలు కచ్చితంగా బయటకు వస్తాయని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. ఒక సీఎం స్థాయిలో తప్పు జరిగిందా లేదా అన్నది విచారణ జరపకుండా ఎటువంటి సాక్షాధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఆయన మీద నింద వెయ్యాలి, ఆయనను హిందువులకు దూరం చేయాలి అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు వ్యాఖ్యలు చేశారన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10