AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (TDCA) ఆవిర్భావం

(అమ్మన్యూస్‌, హైదరాబాద్‌):

తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (TDCA) ఆవిర్భావ కార్యక్రమం శుక్రవారం తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం TDCA ప్రెసిడెంట్, మాజీ సాట్స్ ఛైర్మన్ అల్లీపురం వేంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా MLC   AVN రెడ్డి, రిటైర్డు IAS   K.V.రమణా చారి, స్టేట్ PET అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ రాఘవ రెడ్డి, ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్, క్రికెటర్ లోహిత్,   ప్రవీణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

మొదటగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేసి, వేద పండితుల ఆశీర్వచనం తీసుకొని, లోగో లాంచ్ ను నిర్వహించారు.

తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం TDCA ప్రెసిడెంట్, మాజీ సాట్స్ ఛైర్మన్ అల్లీపురం వేంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ తాను క్రికెట్ క్రీడాకారుడు అని, తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ గా 6 సంవత్సరాల కాలంలో అన్ని క్రీడలు, కార్యక్రమాలకు సమయం లేక పోవడంతో క్రికెట్ క్రీడ ను పట్టించు కోలేక పోయానని, క్రికెట్ క్రీడాకారులకు సరియైన సౌకర్యాలు, ప్రోత్సాహం లేక దశాబ్దాలుగా అన్యాయం జరుగుతుందని, అందుకే   తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ క్రీడాభివృద్ధికి, ప్రతిభ కలిగిన క్రీడాకారులు అంతర్జాతీయ వేదిక లలో ఆడే విదంగా అన్ని రకాలుగా కృషి చేస్తుందని తెలిపారు.

MLC   AVN రెడ్డి  మాట్లాడుతూ, BJP నాయకత్వం నుంచి గాని, కేంద్ర ప్రభుత్వం నుండి గాని, TDCA సాధించడానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని సభా ముఖంగా తెలియజేశారు. ఆ తర్వాత రిటైర్డు IAS అధికారి K.V.రమణా చారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు TDCA ఆవశ్యకతను, ప్రత్యేకతను వివరించి గ్రామీణ క్రికెట్ క్రీడాకారులకు అన్ని రకాల ప్రోత్సాహం అందేలా కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో సుమారు 300 ల మంది క్రికెట్ క్రీడాకారులు తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాల నుండి విచ్చేసి పాల్గొన్నారు. అందరికి కూడా టీ షర్టులు పంపిణీ చేయడం జరిగింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10