భారత జట్టు మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు సోమవారం పెద్దపల్లి జిల్లా మంథనిలో పర్యటించారు. మంథనిలోని ప్రముఖ దేవాల యాలైన శ్రీ గౌతమేశ్వర స్వామి, శ్రీ సరస్వతి అమ్మవారు, శ్రీ భిక్షేశ్వర స్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీరామాలయం, శ్రీ ఆంజనేయస్వామి ఆలయాలను కుటుంబ సమేతంగా ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వెంకటపతి రాజు రాకతో మంథనిలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆయనతో పలువురు ఫొటోలు దిగడంతో పాటు ఆత్మీయంగా సన్మానించి ఆటోగ్రాఫ్స్ తీసుకున్నారు. అనంతరం మంథనిలోని తన మిత్రుడు మహవాది సుధీర్ ఇంటికి వెళ్లి వారితో ఆత్మీయంగా కాసేపు గడిపారు.