సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా నటి రష్మిక మందన్నా ఈ మధ్య ఎక్కువగా కనిపించడం లేదు. ఆమెపై ఎలాంటి వార్తలు వినిపించలేదు. ఈక్రమంలో తాజాగా రష్మిక మంధన్నానే ముందుకు వచ్చి అసలు విషయాన్ని వెళ్లడించింది. గత నెల రోజులుగా నేను యాక్టివ్‌గా లేను. గత నెలలో నాకు యాక్సిడెంట్ అయ్యింది ఇప్పుడు కోలుకున్నాను అంటూ తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది.
ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే ఉంటున్నానని, త్వరలోనే మళ్లీ షూటింగ్స్ కు హాజరవుతానని రష్మిక తెలిపింది. అంతేకగాక జీవితం చాలా విలువైనది. జాగ్రత్తగా ఉండండి. రేపనేది ఉంటుందో లేదో తెలీదు. హ్యాపీగా జీవించండిస అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇప్పుడీ పోస్టు సామాజిక మాద్యమాల్లో బాగా వైరల్ అవుతుంది.
ఇదిలాఉండగా అసలు ప్రమాదం ఎలా జరగింది, షూటింగ్‌లో అయిందా లేక ట్రావెలింగ్‌లో ఏమైనా అయిందా అనే విషయాన్ని చెప్పలేదు. రష్మిక (Rashmika Mandanna) స్పీడుగా కోలుకోవాలని ఆమె అభిమానులు దేవుళల్ఉను ప్రార్దిస్తున్నారు. ఇక రష్మిక నటించిన పుష్ప2, కుబేర సినిమాలు ఈ డిసెంబర్‌లో విడుదలవనుండగా సల్మాన్‌ఖాన్‌తో చేస్తున్న బాలీవుడ్ చిత్రం సికిందర్ వచ్చే సంవత్సరం రంజాన్‌కు రిలీజ్ కానుంది.