AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వసూలు చేస్తే తోలుతీస్తా.. సీఎం రేవంత్‌ తీవ్ర స్థాయిలో హెచ్చరిక

అధికారులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
హైడ్రా ముసుగులో అధికారుల దందాపై ఆగ్రహం
ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులకు దిశానిర్దేశం

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
హైడ్రా ముసుగులో అధికారులు అక్రమాలకు పాల్పడితే తీవ్ర స్థాయిలో చర్యలు ఉంటాయని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ హైడ్రా పేరు చెప్పి భయపెట్టి.. బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందించారు. గతంలో ఇచ్చిన నోటీసులు, రెండు మూడేళ్ల కిందటి ఫిర్యాదులను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్‌ అధికారులు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. అటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్‌ పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు.

హైడ్రా దూకుడు..
కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోంది. కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలు అరికట్టేందుకు ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే నగరంలో చాలా చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఇటీవల సినీ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్ను కూల్చివేసింది. తాజాగా, సీఎం రేవంత్‌ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి సైతం నోటీసులు అంటించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10