ఇజ్రాయెల్ .. ఖాన్ యూనిస్ నగరానికి పశ్చిమాన ఉన్న అల్-మవాసి మానవతా జోన్‌లో నిరాశ్రయులైన వ్యక్తుల నివాసాలను లక్ష్యంగా చేసుకుని మూడు దాడులు జరిగాయి. దీనివల్ల ఏడు మీటర్ల లోతులో భారీ క్రేటర్‌లు ఏర్పడినట్లు స్థానిక నివాసితులు తెలిపారు. ఈ దాడుల్లో “నలభై మంది మరణించారు. 60 మందికి పైగా గాయపడ్డారు, ఇంకా చాలా మంది శిథిలాల కింద ఉన్నారు” అని హమాస్ సివిల్ డిఫెన్స్ అథారిటీ ప్రకటించింది. మరోవైపు హమాస్ యోధులకు చెందిన ఖాన్ యూనిస్‌లోని ఆపరేషన్ సెంటర్‌పై తమ విమానం దాడి చేసిందని, పౌరులకు హాని కలిగించే ప్రమాదాన్ని తగ్గించడానికి తాము చర్యలు తీసుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
వైమానిక దాడుల వల్ల ఏర్పడిన లోతైన రంధ్రం నుండి పాలస్తీనియన్లను రక్షించే ప్రయత్నంలో పౌరులు తమ చేతులతో ఇసుకను తవ్వినట్లు కొన్ని వీడియోలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ, వాటిని అధికారులు నిర్ధారించలేదు.