హైదరాబాద్‌లో వర్షం (Rain) కురుస్తున్నది. శనివారం తెల్లవారుజాము నుంచి వాన పడుతున్నది. బంజారాహిల్స్, బంజారాహిల్స్, లక్డీకపూల్, నాంపల్లి, కోఠి, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, మెహిదీపట్నం, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్, వనస్థలిపురంలో వర్షం కురుస్తున్నది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. వర్షం కురుస్తుండటంతో అక్కడక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
కాగా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. శనివారం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రుం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.