AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కౌషిక్‌రెడ్డి ఓ చీడ పురుగు.. వదిలే ప్రసక్తేలేదు.. అరికెపూడి గాంధీ మరోసారి హాట్‌ కామెంట్స్‌

ఇది మా ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధం
నాపై కౌశిక్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్‌ సమాధానం చెప్పాల్సిందే

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చీడపురుగు అని, వదిలే ప్రసక్తేలేదని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మరో సారి ఫైర్‌ అయ్యారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్నది బీఆర్‌ఎస్‌ పార్టీకి, కాంగ్రెస్‌కి మధ్య యుద్ధం కాదని, కౌశిక్‌ రెడ్డికి, తనకి మధ్య జరుగుతున్న యుద్ధమని అన్నారు. నిన్న 11 గంటలకు తన ఇంటికి వస్తా అన్నారని, ఒకవేళ రాకపోతే తానే ఆయన ఇంటికి వెళ్తానని చెప్పానని తెలిపారు. అందుకే తాను ఆయన ఇంటికి వెళ్లానని అరికపూడి గాంధీ చెప్పారు. అయన తనను స్వాగతిస్తానని అంటేనే వెళ్లానని, తనను ఆహ్వానించి తన మీద కేసు నమోదు చేశారని అన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దని కేసీఆర్‌ పదే పదే చెప్పారుని తెలిపారు. ఆంధ్ర వాళ్ల కాళ్లలో ముళ్లు గుచ్చుకుంటే తన నోటితో తీస్తానని కేసీఆర్‌ అన్నారని చెప్పారు.

పాడి వల్లే బీఆర్‌ఎస్‌ పార్టీ నాశనం..
పాడి కౌశిక్‌ లాంటి వారి వల్లే బీఆర్‌ఎస్‌ పార్టీ నాశనం అవుతుందని అన్నారు. నిన్న ఏకంగా కౌశిక్‌.. డీసీపీ చొక్కా పట్టుకున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ వాళ్లే రాళ్లతో దాడి చేశారని తెలిపారు. కౌశిక్‌ తన ఇంటికి సమావేశానికి వస్తే స్వాగతిస్తానని, టేబుళ్లు, కుర్చీలు రెడీగా పెట్టానని చెప్పారు. అలాగే, టిఫిన్లు, భోజనాలు కూడా సిద్ధం చేయించానని అన్నారు.

కేసీఆర్‌ సమాధానం చెప్పాలి
తనను ఆంధ్రోడన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్‌ సమాధానం చెప్పాలని అరికెపూడి గాంధీ డిమాండ్‌ చేశారు. కౌశిక్‌ రెడ్డి బతకడానికి హైదరాబాద్‌ కు వచ్చినట్టే తాను కూడా హైదరాబాద్‌ కు వచ్చానని ఆయన చెప్పారు.
చీడపురుగుతో నాకు పోలికేంటి..
ఎంతో మందిని చీటింగ్‌ చేసిన కౌశిక్‌ రెడ్డితో తనకు పోలికేంటని ఎద్దేవా చేశారు. తనను బీఆర్‌ఎస్‌ పార్టీలో చేర్పించింది హరీశ్‌ రావు అని చెప్పారు. తాను బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉన్నానని తెలిపారు. తాను బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉన్నానని అసెంబ్లీ స్పీకర్‌ కూడా ప్రకటించారని చెప్పారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10