AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్‌ శకం ముగిసింది.. ముసలోడికి 75 ఏళ్లు వచ్చినయ్‌.. ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణను సర్వనాశనం చేసిండు
(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
‘కేసీఆర్‌ శకం ముగిసింది.. ముసలోడికి 75 ఏళ్లు వచ్చినయ్‌..తెలంగాణను సర్వనాశనం చేసిండు.. కేసీఆర్‌ కట్టిన కాళేశ్వరంతో ఒక్క మీటర్‌ కెనాల్‌ నిర్మించలేదు.. ఒక్క ఎకరాకు నీళ్ళు అందించలేదు.. కాళేశ్వరంలో ఎత్తుడు పోయుడు తప్ప ఏమీ లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైనా ఫైర్‌ అయ్యారు. ఇందిరా పార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద రైతు హామీల సాధన పేరుతో 24 గంటల దీక్ష చేపట్టింది. మంగళవారం ఉదయం 11 గంటల వరకు దీక్ష కొనసాగింది.

ఈ క్రమంలోనే బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్‌లకు తెలంగాణ స్టేట్‌ ఇంఛార్జి అభయ్‌ పటేల్‌ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ దీక్షలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మాట్లాడుతూ.. మోడీ రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిందే మోడీ అని అన్నారు. ప్రాంతీయ పంటలకు నాడు కేసీఆర్‌ ప్రభుత్వం ఇవ్వలేదని, నేడు కాంగ్రెస్‌ ఇవ్వలేదన్నారు. దౌర్భాగ్యమైన ప్రభుత్వం కేసీఆర్‌ నడిపిండూ.. నేడు రేవంత్‌ నడుపుతున్నాడని విమర్శించారు. వారు చేసిన హామీలు పచ్చి మోసంగా మిగిలి పోయాయన్నారు. ఈ రైతుదీక్షలు ప్రతి జిల్లాకు తీసుకుపోతామన్నారు.

హైడ్రా బంద్‌ కావడం ఖాయం..
హైడ్రాపై హైకోర్టు ప్రభుత్వానికి చివాట్లు పెట్టిందని అన్నారు. హైకోర్టును కూడా కూల్చివేస్తారా? అంటూ అనేక మొట్టికాయలు వేసిందని గుర్తుచేశారు. హైడ్రా బంద్‌ కావాలని, ఏదో ఒక రోజు హైడ్రాను బంద్‌ పెట్టే రోజు వస్తోందన్నారు. రేవంత్‌ రెడ్డికి బ్లాక్‌ మెయిల్‌ చేయడం బాగా తెలుసన్నారు. హైడ్రా పేరుతో బ్లాక్‌ మెయిల్‌ చేసి జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. బడాబాబులను ముట్టుకోలేదని, కేవలం గరీబోళ్ల ఇళ్లను కూల్చడమే పనిగా పెట్టుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10