తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. జనరల్ ర్యాంకింగ్ జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మార్చి 1న 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఫరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.45 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫైనల్ కీని సెప్టెంబర్ 6న విద్యాశాఖ విడుదల చేసింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీచర్ల నియామకానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామన్నారు. కేవలం 55 రోజుల్లోనే ఢిఎస్సీ ఫలితాలు ఇచ్చామని చెప్పారు. 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తామని తెలిపారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేశామని వెల్లడించారు. త్వరలోనే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తామన్నారు. స్కూల్ ఫీజుల నియంత్రణపై త్వరలో కమిటీ వేస్తామని చెప్పారు.
https://schooledu.telangana.gov.in/ISMS/ లేదా https://tgdsc.aptonline.in/tgdsc/ లో చేక్ చేసుకోండి..