(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం కుటుంబసభ్యులు హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయన ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నారు. వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలే తప్ప పెద్దగా ఆందోళన పడాల్సింది ఏమీ లేదని వైద్యులు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం అద్వానీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గతనెలలో కూడా∙అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందిన విషయం తెలిసిందే. బీజేపీలో మోస్ట్ సీనియర్ నాయకుల్లో ఒకరైన అద్వానీ 2002 నుంచి∙2004 వరకు ఉప ప్రధానిగా. 1999 నుంచి 2004 వరకు కేంద్ర హోం శాఖ మంత్రిగా పని చేశారు.