AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బంగాళాఖాతంలో అల్పపీడనం… ఏపీకి మరోసారి భారీ వర్షాల అలర్ట్

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు రుతుపవన ద్రోణి తూర్పు బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో, ఏపీలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది.

సెప్టెంబరు 6

  • ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదే సమయంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
  • దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరి కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అమరావతి శాఖ పేర్కొంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
  • రాయలసీమలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని వివరించింది.
  • సెప్టెంబరు 7
    • ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదే సమయంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
    • దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అమరావతి శాఖ పేర్కొంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
    • రాయలసీమలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని వివరించింది.
Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10