AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహేశ్‌ అన్నా.. హ్యాపీ బర్త్‌ డే.. జూ. ఎన్టీఆర్‌ ట్వీట్‌

సూపర్‌ స్టార్‌కు శుభాకాంక్షల వెల్లువ

(అమ్మన్యూస్, హైదరాబాద్‌)
సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ ట్విటర్‌లో విషెస్‌ తెలిపారు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు మహేశ్‌ అన్నా. ఈ ఏడాదంతా మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్‌ చేశారు. మహేశ్‌ తరఫున ఆయన ఫ్యాన్స్‌ వారిద్దరూ కలిసున్న ఫొటోలను పెట్టి తారక్‌కు థాంక్స్‌ చెబుతున్నారు. సూపర్‌ స్టార్, యంగ్‌ టైగర్‌ మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. నేడు 49వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు మహేష్‌ బాబు.

ఆదర్శంలోనూ సూపర్‌ స్టారే..
అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా అసూయ పుట్టించే అందం మహేశ్‌ సొంతం. అందరికీ వయసు పెరిగే కొద్దీ ముఖంలో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. కానీ ఈ హీరోకి మాత్రం యాభైకి చేరువవుతున్నా వయసు మాత్రం 25లోనే ఆగిపోయింది అంటే అతిశయోక్తి కాదు. అతడు నడుస్తుంటే మన ఇంట్లో మనిషి నటించినట్లుగా ఫీలవుతాం. స్వయంగా ఆయన పిల్లలతో ఫొటో దిగితే వాళ్లకు ఈయనే అన్నయ్యలా కనిపించడం విశేషం. సినిమాలలోనే కాదు అటు కమర్షియల్‌ యాడ్స్‌ లోనూ నెంబర్‌ వన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ గా పేరు తెచ్చుకున్నాడు. అలాగే తోటివారు కష్టాలలో ఉంటే ఆదుకునే మెంటాలిటీ. అది తండ్రి హీరో కృష్ణ నుంచే వారసత్వంగా వచ్చింది. ఎందరో చిన్నారులకు హద్రోగ చికిత్సను ఉచితంగా అందిస్తున్న మానవతా వాది. ఇప్పటివరకూ వెయ్యికి పైగా చిన్నారులకు ఈ తరహా ఆపరేషన్లు చేయించారు. వరుసగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 నంది అవార్డులు అందుకున్నాడు. ఇక ఫిలింఫేర్, సైమా అవార్డులు కూడా అందుకున్నాడు. సోషల్‌ మీడియాలోనూ ఎక్కువ మంది ఫాలోవర్స్‌ కలిగిన హీరో మహేష్‌ బాబే. దాదాపు కోటికి పైగా ఫాలోవర్స్‌ ను సొంతం చేసుకున్నాడు ఈ హీరో.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10