(అమ్మన్యూస్, హైదరాబాద్):
‘సినిమా ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదు, మా నాన్న, తాతల సామ్రాజ్యం కాదు.. మెగా, నందమూరి, అక్కినేని, కుటుంబాలదీ కాదు.. కష్టపడి ప్రతిభ చూపించే ప్రతి ఒక్కరిదీ’ అని ఆసక్తికర కామెంట్స్ చేశారు మెగాబ్రదర్ నాగబాబు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన అతిథిగా హాజరయ్యారు. మెగా ఫ్యామిలీపై కామెంట్స్ చేసే ఆకతాయిలకు ఈ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
మాకు అలాంటి ఫీలింగ్ లేదు..
ఆయన మాట్లాడుతూ ‘ఈ మధ్యకాలంలో చాలామంది మెగాఫ్యామిలీ, ఇంకో ఫ్యామిలీ, వీళ్లు తప్ప ఇండస్ట్రీలో ఎవరూ ఉండరు’ అంటూ పనికిమాలిన కామెంట్లు చేసే వెధవల్ని చాలామందిని చూశా. మాకు అలాంటి ఫీలింగ్ లేదు. సినిమా ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదు, మా నాన్న, తాతల సామ్రాజ్యం కాదు.. మెగా, నందమూరి, అక్కినేని, కుటుంబాలదీ కాదు.. కష్టపడి ప్రతిభ చూపించే ప్రతి ఒక్కరిదీ. ఇది అందరిదీ. ఎలాంటి నేపథ్యంలో లేకుండా వచ్చిన అడివి శేష్ తన కష్టంతో ఎదిగాడన్నారు. ప్రస్తుతం ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రంలో నటించిన ఆర్టిస్ట్‌లు ఎవరు ఏ స్థాయికి వెళ్తారో ఎవరు ఊహించలేమన్నారు. ఇప్పుడు ఓటీటీలు అందుబాటులో ఉన్నాయని, నిరూపించుకోవడానికి చాలా వేదికలు ఉన్నాయి. మంచి కథ ఎంచుకుని, నిబద్ధతతో పని చేసిన వారికి విజయం తప్పనిసరి అని నాగబాబు అన్నారు.