AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మంత్రి కొండా సురేఖ కంటతడి.. కేటీఆర్‌కు తీవ్ర హెచ్చరిక

మంత్రి కొండా సురేఖ కంటతడి పెట్టారు. తనపై ట్రోలింగ్ వ్యవహారంపై  సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పలుమార్లు కంటతడి పెట్టారు. తనపై ట్రోలింగ్ పట్ల మంత్రి భావోద్వేగానికి గురయ్యారు.

కేటీఆర్ ఖబడ్దార్ .. ఖబడ్దార్ కేసీఆర్ అని ఆమె హెచ్చరించారు. ఈ ట్రోలింగ్ వీడియోలను మీ చెల్లికి, తల్లికి చూపించు కేటీఆర్ అని అన్నారు. ఇకపై ట్రోలింగ్ చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అన్ని పార్టీల వాళ్లు తనను అక్కా అని, తన భర్తను బావ అని పిలుస్తారని ఆమె చెప్పారు. ఇంకోసారి ఇలా చేస్తే కేటీఆర్ బట్టలు ఊడదీసి పరిగెత్తిస్తామని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. రఘునందన్ కాల్ చేసి క్షమించమని అడిగాడని, అక్కా క్షమించు కాళ్లు మొక్కుతా అని రఘునందన్ అన్నాడని ప్రస్తావించారు.

‘‘ఏదో ఒకరోజు ప్రజలు తిరగబడతారు. చేనేత కార్మికుల ఓట్లతో గెలిచి పద్మశాలి బిడ్డను ఇంత అవమనపరుస్తారా?. మానసిక వేదన కలిగించి కుటుంబాల్లో ఇబ్బంది పెడుతారా?. నాకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే కేసీఆర్ మహిళకు మంత్రిపదవి ఇవ్వలేదు. రెండవరసారి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్‌లో భారీ మార్పులు వచ్చాయి. బీఆర్ఎస్ నాయకులు డబ్బు మదం ఎక్కి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు’’ అని అన్నారు.

కేసీఆర్ భార్యకు సూటి ప్రశ్న

బీఆర్ఎస్ నాయకులు ట్రోల్ చేస్తున్న ఫొటోల్లో తప్పు ఏముందో కేసీఆర్ భార్య శోభమ్మ చెప్పాలని మంత్రి కొండ సురేఖ అన్నారు. ‘‘ఉన్నత వర్గం అనే బలుపు బీఆర్ఎస్‌కు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన మహిళలపై ఇలాంటి ట్రోలింగ్ చేస్తున్నారు. పనులు కావాలంటే నా దగ్గరికి రండి అని గత పాలకులు ఇబ్బంది పెట్టారు. హరీష్ డీపీ పెట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. కేటీఆర్ హరీశ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలి. డిస్కో డాన్సులు నేర్పిందే మీ చెల్లి. అమెరికా సంస్కృతి తెచ్చి బతుకమ్మకు అంటించింది మీ చెల్లి. బతుకమ్మ సహజత్వాన్ని చెదగొట్టిందే మీ చెల్లి’’ అంటూ మంత్రి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10