కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అర్ధరాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తమ అభిమాన హీరోకి ఏమైందో అని కంగారు పడ్డారు. అయితే నార్మల్ చెకప్‌లో భాగంగా గుండెకు చెకప్ చేయించుకున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. ఆపై ఆయన ఆరోగ్యం కూడా కాస్త కుదుటపడిందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
రజినీకాంత్‌కు పొత్తి కడుపులో నొప్పి రావడంతోనే హాస్పిటల్‌లో జాయిన్ చేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే వైద్యులు ఆయకు ఆపరేషన్ పూర్తి చేశారని.. పొత్తి కడుపులో స్టెంట్ వేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక తమ అభిమాన హీరోకి కడుపునొప్పి కారణంగా ఆపరేషన్ చేయడంతో అభిమానులు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
అదే సమయంలో రజినీకాంత్ భార్య లతా సైతం స్పందించారు. ప్రస్తుతానికి రజినీకాంత్ ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. ఆయన ఆరోగ్యం విషయంలో ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయన ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుటపడుతుందని.. ఎవరూ కంగారు పడకండని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఆమె స్పందనతో తలైవా అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.