తెలంగాణలో డిస్కంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకున్నది. గురువారం ఉదయం 7.30 గంటలకు రికార్డు స్థాయికి చేరుకుందని.. ఈ ఏడాది ఈ సీజన్‌లో 15,573 మెగావాట్లకు విద్యుత్ వినియోగం పెరిగిందని జెన్, ట్రాన్స్‌కో సీఎండీ తెలిపారు. గతేడాదిలో ఈ సీజన్‌లో అత్యధికంగా 14,816 మెగావాట్లు వినియోగం నమోదైందని.. గతేడాదితో పోలిస్తే 5.11శాతం అత్యధిక వినియోగమని పేర్కొన్నారు. గతేడాది మార్చిన 15,623 మెగావాట్ల రికార్డు విద్యుత్ వినియోగం రికార్డయ్యిందని.. అత్యధికంగా మార్చి 14న 308.54 మిలియన్ యూనిట్లు వినియోగించినట్లు తెలిపారు.
ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 266.14 మిలియన్ యూనిట్లు సరఫరా చేశామని.. గతేడాది ఆగస్టు సమయంలో 250.25 మిలియన్లు సరఫరా అయ్యిందని.. గతేడాదితో పోలిస్తే 6.35శాతం ఎక్కువ అని పేర్కొంది. పీక్ ఖరీఫ్ సీజన్ అయిన సెప్టెంబర్, అక్టోబర్‌లో 17వేల మెగావాట్ల వరకు డిమాండ్ ఉండవచ్చని.. వ్యవసాయంతో పాటు ఇతర వినియోగదారులకు అవసరమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు డిస్కమ్‌లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్‌శాఖ అధికారులను డిప్యూటీ సీఎం అభినందించినట్లు వివరించారు.