AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌పై రేవంతన్న.. అభిమానుల వినూత్న శుభాకాంక్షలు

(అమ్మన్యూస్, న్యూయార్క్‌):
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి న్యూయార్క్‌లో అభిమానులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా అమెరికాకు చేరుకున్న రేవంత్‌ రెడ్డి టీమ్‌ కు అక్కడ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటన సందర్భంగా ఆయన అభిమానులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రఖ్యాత న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌ స్ట్రీట్‌ లో రేవంత్‌ రెడ్డి ఫొటోలను ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

హైదరాబాద్‌ లో టీ స్క్వేర్‌..
అమెరికాలోని న్యూయార్క్‌ సిటీలో ఉన్న టైమ్‌ స్క్వేర్‌ ను తలపించేలా హైదరాబాద్‌ లోనూ టీ స్క్వేర్‌ పేరుతో మల్టీపర్పస్‌ హబ్‌ నిర్మించాలని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాయదుర్గంలో డెవలప్‌ చేయాలని భావిస్తున్నది. ఈ మేరకు టెండర్లను సైతం టీజీఐఐసీ పిలిచింది. దీని నిర్మాణంతో హైదరాబాద్‌ సిగలో మరో ఐకానికి ల్యాండ్‌ మార్క్‌ ను సెట్‌ చేయాలని రేవంత్‌ రెడ్డి సర్కార్‌ ఏర్పాట్లు చేస్తున్నది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10