AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పోరాటానికి సిద్ధమవుతోన్న సమంత..

మలయాళ చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికితేవడంలో హేమ కమిటీ పనితీరు అద్భుతంగా ఉందని టాలీవుడ్‌ కథానాయిక సమంత ప్రశంసించారు. అలాగే ఈ కమిటీ ఏర్పాటుకు కారణమైన డబ్ల్యూసీసీ (ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌) సంస్థనూ ఆమె అభినందించారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో 2019లో సృష్టించబడిన టాలీవుడ్ సపోర్ట్ గ్రూప్ అయిన ది వాయిస్ ఆఫ్ ఉమెన్‌‌ కూడా నడవాలని ఆమె కోరారు.

మలయాళ చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికితేవడంలో హేమ కమిటీ (Hema Committee) పనితీరు అద్భుతంగా ఉందని టాలీవుడ్‌ హీరోయిన్ సమంత (Samantha) ప్రశంసించారు. అలాగే ఈ కమిటీ ఏర్పాటుకు కారణమైన డబ్ల్యూసీసీ (ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌) సంస్థనూ ఆమె అభినందించారు. ఆ సంస్థ సభ్యుల కష్టం వల్లే ఈ రోజు మహిళల సమస్యలు చర్చనీయాంశంగా మారాయని చెప్పారు. సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ కోసం ఆ సంస్థ అవిశ్రాంతంగా పాటుపడుతోందని అభినందించారు. ‘డబ్ల్యూసీసీ (WCC) గురించి నాకు చాలా కాలంగా తెలుసు. ప్రభుత్వం హేమ కమిటీ ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ తీసుకొన్న చొరవే కారణం. వారి పోరాటానికి నా కృతజ్ఞతలు’ అని తెలిపిన సమంత.. తాజాగా టాలీవుడ్‌లోనూ కదలిక తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అంటే ఒక రకంగా పోరాటానికి సిద్ధమవుతోందని చెప్పుకోవచ్చు.

అన్ని సినీ ఇండస్ట్రీలలో ఇప్పుడు హేమ కమిటీ గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ టాలీవుడ్‌ (Tollywood)కు సంబంధించి ఏ ఒక్కరూ ఇంత వరకు బయటికి రాలేదు. అలాంటి వారందరి తరపున సమంత నిలబడాలని చూస్తుందేమో తెలియదు కానీ.. తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా చేసిన పోస్ట్ మాత్రం వైరల్ అవుతోంది. టాలీవుడ్‌ మహిళల తరపున ఆమె హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నట్లుగా పేర్కొంటూ.. తెలంగాణ ప్రభుత్వానికి  కూడా ఓ విన్నపాన్ని విన్నవించుకుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10