AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వేణుస్వామికి షాక్..! పోలీసులకు కోర్టు కీలక ఆదేశాలు..

జ్యోతిషుడు వేణుస్వామికి బిగ్ షాక్ తగిలింది. మూర్తితో వివాదంలో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వేణుస్వామిపై కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది . జాతకాల పేరుతో వేణుస్వామి ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రధాని ఫొటోను మార్ఫింగ్ చేసి తప్పుదోవ పట్టించారని మూర్తి అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఆ మోసాన్ని వెలుగులోకి తెచ్చిన తనపై వేణుస్వామి కుట్ర పన్నారని, తనకు హాని తలపెట్టాలని ప్లాన్ చేశారని పిటిషన్ లో ఆరోపించారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. వేణుస్వామిపైన కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఆదేశించింది.

వేణుస్వామి, మూర్తి మధ్య వివాదం నడుస్తోంది. మూర్తిపై వేణుస్వామి దంపతులు సంచలన ఆరోపణలు చేశారు. రూ.5 కోట్లు ఇవ్వాలని మూర్తి వేధిస్తున్నారని వేణుస్వామి దంపతులు ఆరోపించారు. 2017 నుంచి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. అప్పట్లో మూర్తి అడిగిన డబ్బు ఇవ్వలేదన్నారు. 8 నెలలుగా మళ్లీ వేధింపులకు గురి చేస్తున్నారని, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి దంపతులు.

వేణుస్వామి దంపతుల ఆరోపణలను మూర్తి తీవ్రంగా ఖండించారు. తాను వేణుస్వామిని రూ.5 కోట్లు అడిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు మూర్తి. తాను రూ.5 కోట్లు డిమాండ్ చేశానని ఆరోపణలు చేసిన వేణుస్వామి దంపతులపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేణుస్వామి చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమన్న మూర్తి.. నిజాలేంటో త్వరలోనే బయటకు వస్తాయన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10