మంత్రి ప్రత్యేక పూజలు
(అమ్మన్యూస్, జోగులాంబ గద్వాల): అలంపూర్ శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శుక్రవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నన్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు మంత్రికి అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.