అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళలకు గురువారం ఉదయం నిశ్చితార్థం జరిగిన విషయాన్ని ఫొటోలతో కింగ్ నాగార్జున (King Nagarjuna) ఎక్స్ వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. నాగ చైతన్యకు ఇది రెండో మ్యారేజ్. ఇంతకు ముందు స్టార్ హీరోయిన్ సమంతని ఆయన ప్రేమించి, పెళ్లాడారు. అయితే ఆ పెళ్లి బంధం మూడునాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది. ఇద్దరి వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తడంతో.. ఇద్దరూ లీగల్‌గా విడిపోయి.. ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. చైతూ, సమంత విడాకుల అనంతరం శోభితకు చైతూ దగ్గరవుతున్నట్లుగా వార్తలు దర్శనమిస్తూనే ఉన్నాయి. అంతేకాదు, కొన్ని ఈవెంట్స్‌లో కూడా వీరిద్దరూ కలిసి కనిపించి ఆ వార్తలకు బలం చేకూర్చారు. సందర్భం వచ్చిన ప్రతిసారి ఇద్దరి మధ్య ఏం లేదనేలా ప్రవర్తిస్తూ వచ్చినప్పటికీ.. వారిపై వార్తలు ఆగలేదు. చివరికి ఇలా ఇద్దరూ నిశ్చితార్థం చేసుకుని.. వారి మధ్య రిలేషన్‌ని బయటి ప్రపంచానికి తెలియజేశారు. ఇదిలా ఉంటే.. శోభిత ధూళిపాళ, సమంతకు అక్క అవుతుందట? ఈ ట్విస్టేంటి అనుకుంటున్నారా?
దీనికి పెద్ద కథేం లేదులే కానీ.. నిజంగానే సమంతకు శోభిత అక్క అవుతుంది. అయితే మీరనుకుంటున్న సమంత అయితే కానే కాదు. శోభితకు ఓ చెల్లెలు ఉంది. ఆమె పేరు కూడా సమంతే. అదే ఇక్కడ ట్విస్ట్. సమంత ధూళిపాళ పేరును తీసుకుని ఆమెకు శోభిత అక్క అవుతుంది అంటూ ఈ నిశ్చితార్థ విషయం బయటికి వచ్చినప్పటి నుంచి ఒకటే వార్తలు. దీంతో అందరూ నిజమేనేమో అనుకుంటూ సెర్చింగ్ మొదలుపెట్టారు. అసలు విషయం ఇది. తన చెల్లెలు సమంతతో శోభిత ఉన్న ఫొటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతుండటం విశేషం.