(అమ్మన్యూస్, హైదరాబాద్):
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సాట్ చైర్మన్ శివసేనా రెడ్డి శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీ ఏ) కార్యాలయాన్ని సందర్శించనున్నారు.
హెచ్ సీ ఏ లో జరుగుతున్న అవకతవకలపై విద్యార్థుల నుంచి సాట్ కు అనేక ఫిర్యాదులు రావడంతో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టనున్నారు. వచ్చిన ఆరోపణలను పరిశీలించి సమగ్ర విచారణ కు ఆదేశించనున్నారు. వికాసం వైపు క్రీడారంగాన్ని నడిపిస్తానని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రోజు స్పష్టం చేసిన విషయం విదితమే.