తిరుమల లడ్డూ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. కొద్దిరోజులుగా తిరుమలలో లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ పైన కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివాదంలో నిజం నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో లడ్డూ వివాదంలో వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఈ రెండు పిటిషన్ల పైన సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.
తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు బెంచిని నిర్ణయించింది. జస్టిస్ బి ఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్ బెంచ్ కి ఈ కేసును కేటాయించారు. ఈనెల 30న సుప్రీంకోర్టు ఈ కేసును విచారించనుంది. ఆరోజున విచారించే కాజు లిస్టులో ఐటో నెంబర్ 63గా తిరుమల లడ్డూ కేసు లిస్ట్ అయింది. సుబ్రహ్మణ్యస్వామి ఈ కేసులో స్వయంగా తన వాదనలు వినిపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.