టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ రోల్‌లో నటిస్తోన్న చిత్రం దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వంలో రెండు పార్టులుగా వస్తుండగా.. దేవర పార్టు 1 నేడు (సెప్టెంబర్ 27న) ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.
బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించింది. సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటించాడు. ఈ ఇద్దరికీ టాలీవుడ్ ఎంట్రీ ప్రాజెక్ట్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.
ప్రీ సేల్స్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన దేవర మరి బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలు అందుకున్నాడ ..? తారక్ అభిమానులకు కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్నాయా..? అనే దానిపై నెటిజన్లు ఏమంటున్నారో ఓ లుక్కేస్తే..
నెట్టింట టాక్ ఎలా ఉందంటే..?
క్లైమాక్స్ ట్విస్ట్ అంచనా వేయలేమని, సెకండాఫ్ ఎంగేజింగ్‌గా చూపించాడని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.
దేవర గేమ్ ఛేంజర్. కేవలం సౌతిండియన్ సినిమానే కాదు.. భారతీయ సినిమా. బిగ్గెస్ట్ హిందీ బ్లాక్ బస్టర్ రికార్డులను అధిగమించే దిశగా వెళ్లడం ఖాయం.
సినిమాటిక్ మాస్టర్‌పీస్ అప్పీల్‌తో దేవర ఫస్ట్ హాఫ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. చివరి 20 నిమిషాలు పవర్ ఫుల్ ఎండింగ్‌తో గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని మరో యూజర్ రాసుకొచ్చాడు.
గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు, జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయే ఎంట్రీ.. టైటిల్ కార్డు, సైఫ్ అలీఖాన్‌తో ఇతర యాక్టర్ల పర్‌ఫార్మెన్స్, అద్భుతమైన విజువల్స్, అనిరుధ్ బీజీఎంతో అభిమానులకు విజువల్ ఫీస్ట్‌లా ఉంటుందని మరో యూజర్ కామెంట్ పెట్టాడు.
ఫస్ట్ హాఫ్ సూపర్.. సెకండాఫ్ యావరేజ్. తారక్ నటన, ఫియర్ సాంగ్ సినిమాకు మెయిన్ హైలెట్ అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.
కొరటాలకు మరో ఆచార్య.. బీజీఎం అదిరింది.. వీఎఫ్‌ఎక్స్ ఆచార్య కంటే ఉత్తమంగా ఉన్నాయని ట్వీట్ చేశాడు..
తారక్, జాన్వీకపూర్ యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎలివేషన్స్ ఫైరింగ్ మూడ్‌లో సాగుతుంది. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్యాంగ్ స్టన్నింగ్‌గా ఉంది. అదిరిపోయే బీజీఎంతో ఎపిక్ ఫైట్ సీక్వెన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఎండింగ్‌లో పార్ట్ 2 శౌర్యాంగ పర్వం టైటిల్‌ను రిలీజ్ చేస్తారని మరో యూజర్ కామెంట్ పెట్టాడు.