AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మంగళవారం ఢిల్లీలో ఆయన బిజీబిజీగా గడపనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పరామర్శ, ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఇలా మంగళవారం  ఢిల్లీలో బిజీగా ఉండనున్నారు.

జమ్ము కశ్మీర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా మల్లికార్జున ఖర్గే స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రేపు ఉదయం ఆయనను ముఖ్యమంత్రి పరామర్శిస్తారు. ఆ తర్వాత కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. హైదరాబాద్‌లో హైడ్రా, మూసీ ప్రక్షాళన అంశాలపై ప్రభుత్వంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. నిర్వాసితులూ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా, మూసీ ప్రక్షాళనకు సంబంధించి అన్ని వివరాలను అధిష్ఠానానికి వివరించనున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10