డ్రా ఖాయం అనుకున్న కాన్పూర్ టెస్టు అనూహ్యంగా భారత్ వైపు తిరుగుతోంది. రెండు రోజులు ఆట సాగకపోవడంతో ఫలితం కోసం టీమిండియా గట్టిగా ప్రయత్నిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను 233 పరుగులకే ఆటౌట్ చేసిన రోహిత్ సేన ఆ తర్వాత సుడిగాలి ఇన్నింగ్స్ ఆడింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(72), కేఎల్ రాహుల్(68)లు విధ్వంసక హాఫ్ సెంచరీలో పర్యాటక బౌలర్లను హడలెత్తించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్(2/14) ధాటికి బంగ్లా రెండు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. ఐదో రోజు తొలి సెషన్‌లో భారత పేసర్లు చెలరేగితే విజయం ఎవరిదో తెలిపోవడం ఖాయం అనిపిస్తోంది.
చెపాక్‌లో బంగ్లాదేశ్‌ను భారీ తేడాతో ఓడించిన భారత జట్టుపై కాన్పూర్‌లో వరుణుడు నీళ్లు చల్లాడు. మూడు రోజుల విరామం తర్వాత ఆట మొదలైంది. అయినా సరే గెలుపే లక్ష్యంగా రోహిత్ సేన దూకుడు చూపించింది. తొలి ఇన్నింగ్స్‌ను యశస్వీ(72), రాహుల్(56) మెరుపులతో 285-9 వద్ద డిక్లేర్ చేసిన భారత్.. వికెట్ల వేటను మొదలెట్టేసింది.