దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం వివిధ మార్గాల మధ్య నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు ఆయా ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. రాబోయే దసరా, దీపావళి, ఛట్‌పూజ నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆయా రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొంది.
ప్రత్యేక రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరింది. పొడిగించిన రైళ్లలో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి. సికింద్రాబాద్-రామనాథపురం (07695), రామనాథపురం-సికింద్రాబాద్ (07696), కాచిగూడ – మధురై (07191), మధురై – కాచిగూడ (07192), కాచిగూడ – నాగర్‌కోయిల్ (07435), నాగర్‌కోయిల్ – కాచిగూడ (07436), సికింద్రాబాద్ – కొల్లం (07193), కొల్లం – సికింద్రాబాద్ (07194) డిసెంబర్ వరకు రాకపోకలు సాగిస్తాయని తెలిపింది.
అలాగే, తిరుపతి-అకోల, అకోల-తిరుపతి, సికింద్రాబాద్-తిరుపతి, తిరుపతి సికింద్రాబాద్, కాకినాడ టౌన్ – లింగంపల్లి, లింగంపల్లి-కాకినాడ టౌన్, కాచిగూడ – తిరుపతి, తిరుపతి-కాచిగూడ, నర్సాపూర్-సికింద్రాబాద్, మచిలీపట్నం – తిరుపతి, సికింద్రాబాద్ – అగర్తలా, హైదరాబాద్ – జైపూర్, హైదరాబాద్ – గోరక్‌పూర్, తిరుపతి- షిర్డీ సాయినగర్, సికింద్రాబాద్ -దానాపూర్, సంత్రాగాచి-సికింద్రాబాద్, షాలిమార్ – సికింద్రాబాద్, హజ్రత్ నిజాముద్దీన్ – సికింద్రాబాద్‌తో పాటు పలుమార్గాల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని వివరించింది.