AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తిరుమల లడ్డూ వివాదం ముమ్మాటికీ చంద్రబాబు కుట్రే.. నిప్పులు చెరిగిన మాజీ మంత్రి ఆర్కే రోజా

(అమ్మన్యూస్, అమరావతి):

మాజీ మంత్రి ఆర్కే రోజా సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎందరినో బలితీసుకొన్న చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. ఇప్పుడు తిరుమల లడ్డూను కూడా తన స్వార్థ ప్రయోజనాల కోసం బజారుకీడ్చి అపవిత్రం చేస్తున్నాడని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు తిరుమల పవిత్రతను బ్రష్టు పట్టిస్తున్నాడని, దేవుడితో ఆటలాడుతున్నాడని రోజా నిప్పులు చెరిగారు. శనివారం మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న రోజా తమిళ మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజకీయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాలకోసం సొంతమామ ఎన్టీఆర్‌ నే బలి తీసుకొన్న చరిత్ర చంద్రబాబుదన్నారు.

ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అలవిగాని హామీలు ఇచ్చాడని మండిపడ్డారు. అబద్దాలు చెప్పి జనాన్ని మభ్య పెట్టాడు. ఈవీయంలను మ్యానేజ్‌ చేసి గెలిచాడని ఆరోపించారు. గెలిచాక హామీలను తుంగలో తొక్కి జనాన్ని మోసం చేశాడని అన్నారు. ఇప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నాడన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉంటే తను భవిష్యత్‌ లో సీఎం కాలేనని భావించి రాష్ట్రాన్నే ముక్కలు చేశాడని, చంద్రబాబు కుట్ర దారుడని రోజా మండిపడ్డారు. లడ్డూ వివాదం తెరమీదకు తెచ్చిన చంద్రబాబు చంద్రబాబు సీఎం అయిన 100 రోజుల్లోనే అరాచకాలు, ఆగడాలు చేస్తున్నారని మండిపడ్డారు. వరదల సమయంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని రోజా విమర్శించారు. జనం వరదల ఫెయిల్యూర్‌ పై చంద్రబాబుపై ఆగ్రహంతో రోడ్డెక్కారని, దాని నుండి దృష్టి మరల్చటానికి లడ్డూ వివాదం తెరమీదకు తెచ్చారని రోజా ఆరోపించారు.

లడ్డూ కల్తీతో జగన్‌ కు ఏం సంబంధం?
జగన్‌ పాలన ముగిశాక వచ్చిన నెయ్యితో లడ్డూ కల్తీతో జగన్‌ కు ఏం సంబంధం అంటూ రోజా మండిపడ్డారు. వీళ్ళ ప్రభుత్వ హయాంలో ఏదైనా తప్పు జరిగి ఉంటే సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలి గానీ, ఇలా లడ్డూపై తప్పుడు ప్రచారంచేసి తిరుమల పవిత్రతను బజారుకీడ్చడం ఏమిటి? అని రోజా ప్రశ్నించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10