AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గ్రామీణ క్రికెటర్లకు న్యాయం చేస్తాం!.. శాట్జ్‌ మాజీ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి

తెలంగాణ జిల్లాల క్రికెట్‌ సంఘం లోగో ఆవిష్కరణ

(అమ్మన్యూస్‌, హదరాబాద్‌):
దశాబ్దాలుగా తెలంగాణ గ్రామీణ క్రికెటర్లకు తీరని అన్యాయం జరిగింది. జిల్లా కేంద్రాల్లో క్రికెట్‌ మౌళిక సదుపాయాలు లేకపోవటంతో ప్రతిభావంతులైన తెలంగాణ గ్రామీణ క్రికెటర్లు కనీసం రాష్ర్ట స్థాయి పోటీలకు సైతం దూరమయ్యారు. తెలంగాణ గ్రామీణ క్రికెటర్లకు న్యాయం చేసేందుకు, జాతీయ స్థాయిలో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు తెలంగాణ జిల్లాల క్రికెట్‌ సంఘం (టీడీసీఏ) ఓ వేదిక కానుంది అని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్‌) మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి తెలిపారు. ‘తెలంగాణ రాష్ర్టంలో ఆరు సంవత్సరాలు క్రీడాప్రాధికార సంస్థ చైర్మన్‌గా పని చేశాను. శాట్జ్‌ చైర్మన్‌గా అన్ని క్రీడలను అభివృద్ది చేయాల్సిన నా బాధ్యత నాపై ఉండేది.

నా హయాంలోనే తెలంగాణ నుంచి నిఖత్‌ జరీన్‌, ఇషా సింగ్‌, ఆకుల శ్రీజ, హుస్సాముద్దీన్‌, వ్రితి అగర్వాల్‌ వంటి చాంపియన్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. అదే తరహాలో క్రికెట్‌లోనూ తెలంగాణ నుంచి చాంపియన్లను తయారు చేసేందుకు తెలంగాణ డిస్ర్టిక్స్‌ క్రికెట్‌ అసోయేషన్‌ను ఆవిష్కరిస్తున్నాం. అందరి సహకారంతో త్వరలోనే బీసీసీఐ గుర్తింపు సాధించేందుకు ముందుకు సాగుతామని’ వెంకటేశ్వర్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన టీడీసీఏ లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు కె.వి. రమణాచారి, ou ప్రవీణ్ కుమార్, సీనియర్ కోచ్ రాజ శేఖర్, సహా టీడీసీఏ ఆఫీస్‌బేరర్లు, జిల్లా స్థాయి క్రికెటర్లు పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10