చిత్రం: పాగల్ వర్సెస్ కాదల్
విడుదల తేది: 9-8-2024
నటీనటులు: విజయ్ శంకర్, విషిక, బ్రహ్మాజి, షకలక శంకర్, ప్రశాంత్ కూఛిబొట్ల, అనూహ్య సారిపల్లి, ఆద్విక్ బండారు, తదితరులు
థియేటర్‌లోకి మరో యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ వచ్చేసింది. “దేవరకొండలో విజయ్ ప్రేమకథ”, “ఫోకస్” వంటి సినిమాలతో ఆడియన్స్‌కు పరిచయమైన యంగ్ హీరో విజయ్ శంకర్ హీరోగా నటించిన “పాగల్ వర్సెస్ కాదల్” శుక్రవారం (ఆగస్టు 9న) విడుదలైంది. విజయ్ శంకర్‌కు జంటగా విషిక నటించింది. శివత్రి ఫిలింస్ బ్యానర్‌పై పడ్డాన మన్మథరావు నిర్మించిన ఈ చిత్రాన్ని రాజేశ్ ముదునూరి దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “పాగల్ వర్సెస్ కాదల్” ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ: కార్తీక్ (విజయ్ శంకర్) అనే యువకుడు ప్రియ (విషిక)ని చూసి ప్రేమిస్తాడు. ఐతే విషికది వెరైటీ క్యారెక్టర్. సైకోలా బిహేవ్ చేస్తుంటుంది. కార్తీక్ తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకునేందుకు టెస్టులు చేస్తుంటుంది. ఆమె మీద ప్రేమతో ప్రియ చేసే ఆరాచకలన్నీ భరిస్తూ ఆమెనే ప్రేమిస్తాడు కార్తీక్. ప్రియ బ్రదర్ మనోజ్ ఒక సైకియాట్రిస్ట్, అతన్ని లవ్ చేస్తుంది కార్తీక్ సోదరి అమృత. కానీ అమృత లవ్ ను మనోజ్ ఒప్పుకోడు ఎందుకంటే అతనిది కూడా ఒక సైకో మైండ్ సెట్. తనే అందరికన్నా గొప్పవాడని ఫీలయ్యే మనోజ్. అమాయకుడైన కార్తీక్, అతని సోదరి అమృత, సైకో మైండ్ సెట్ ఉన్న ప్రియ, మనోజ్ లవ్‌లో సక్సెసయ్యారా? ఆ క్రమంలో ఎలాంటి వింత విషయాలు చోటు చేసుకుంటాయనేది తెలుసుకోవాలంటే గో టూ థియేటర్.
నటీనటుల ప్రతిభ: అమాయకుడైన యువకుడు కార్తీక్ పాత్రలో విజయ్ శంకర్ నటనకు ఫుల్ మార్కులు వేయాల్సిందే. అమాయకుడిగా, లవర్ ఎన్ని బాధలు పెట్టినా ప్రేమతో భరించే పాత్ర చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రియ పాత్రలో విషిక సైకోయిజాన్ని గట్టిగా చూపించి చివరికి చేతబడి కూడా నేర్చుకునే స్థాయికి వెళ్లే క్రమంలో చేసే యాక్టింగ్ అందరికి నచ్చుతుంది. గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యేలా నటించింది. మీరు సినిమా చూస్తే తను యాక్టింగ్ చేస్తుందా లేక రియల్ గా ఉందా అనుకుంటారు. ఇక అమృతగా అనూహ్య సారిపల్లి యాక్టింగ్ కూడా సూపర్. శాడిస్ట్ సైకియాట్రిస్టుగా మనోజ్ పాత్రలో ప్రశాంత్ మెప్పించాడు. కార్తీక్ ఫ్రెండ్ ప్రసాద్ తన పాత్రలో చేసిన ఎంటర్‌టైన్మెంట్ అలరిస్తుంది. మిగతా నటులు తమ తమ పాత్రల పరిధి మేర నటించి పరవాలేదనిపించారు.
సాంకేతిక నిపుణులు: టెక్నికల్‌గా ముందుగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్. ప్రవీణ్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలైట్. బీజీఎం కూడా అదిరిపోయింది. డైరెక్టర్ రాజేశ్ ముదునూరి అన్ని టెక్నికల్ విభాగాలను సమర్థంవంతంగా ఉపయోగించుకున్నాడు. సినిమా క్వాలిటీ కోసం నిర్మాతలు ఎక్కడ తగ్గలేదని అర్థమవుతుంది. సబ్జెక్టు సరిగ్గా అర్థమయ్యేందుకు నవధీర్ అందించిన సినిమాటోగ్రఫీ బాగా హెల్పియింది. శ్యామ్ కుమార్ ఎడిటింగ్, ప్రవీణ్ సంగడాల మ్యూజిక్ ఆకర్షణ అవుతాయి. కథకు తగినట్లు శివత్రీ ఫిలింస్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఆకట్టుకుంటాయి.
విశ్లేషణ: రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి ఈ తరం ప్రేక్షకులకు బాగా కనెక్టు అవుతుందని చెప్పవచ్చు. “పాగల్ వర్సెస్ కాదల్” సినిమాలో బ్రహ్మాజీ, షకలక శంకర్ క్యారెక్టర్స్ కీలకం. కథను వాళ్లిద్దరు నెరేట్ చేస్తుంటారు. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్రహ్మాజీ, షకలక శంకర్ పాత్రలు మూవీలో కొనసాగుతాయి. ప్రేమ కథల్లో సరికొత్త కోణం ఈ చిత్రం. ఈ తరం ప్రేమికులకు కొత్తగా అనిపించేలా తీయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ప్రేమకు నమ్మకం ఉండాలి కానీ అనుమానం కాదు అది ఉంటే జీవితం నరకమే అనే పాయింట్ యంగ్ ఆడియన్స్‌కు బాగా ఎక్కుతుందని చెప్పొచ్చు. ఈ తరం ప్రేమికులంతా “పాగల్ వర్సెస్ కాదల్” కథకు కనెక్ట్ అవుతారు. “పాగల్ వర్సెస్ కాదల్” థియేటర్‌కు వెళ్లి చూడాల్సిన సినిమా అని నిస్సంహదేహంగా చెప్పొచ్చు.
టెక్నికల్ టీమ్: ఎడిటింగ్,
డీఐ: శ్యామ్ కుమార్.పి.,
సినిమాటోగ్రఫీ: నవధీర్,
మ్యూజిక్: ప్రవీణ్ సంగడాల,
బ్యానర్: శివత్రి ఫిలింస్,
నిర్మాత: పడ్డాన మన్మథరావు,
రచన, దర్శకత్వం: రాజేశ్ ముదునూరి
రేటింగ్: 3 / 5