AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు

జేఈఈ మెయిన్‌ ర్యాంకుల్లో ‘టాప్‌’ లేపిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు..
జనవరి, ఏప్రిల్‌లలో జరిగిన జేఈఈ మెయిన్‌ మొదటి, చివరి విడతలో వచ్చిన ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ర్యాంకుల్ని ప్రకటించింది. ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విజయభేరి మోగించారు. ఫస్ట్, సెకండ్‌ ర్యాంకులతోపాటు, తొలి పది ర్యాంకుల్లో నాలుగింటిని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విద్యార్థులే దక్కించుకున్నారు.

హైదరాబాద్‌కు చెందిన సింగరాజు వెంకట్‌కౌండిన్య 300కు 300 మార్కులు సాధించి జాతీయస్థాయిలో ఫస్ట్‌ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. నెల్లూరుకు చెందిన పునుమల్లి లోహిత్‌ ఆదిత్యసాయి సైతం 300 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. హైదరాబాద్‌లో చదివిన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకికి చెందిన సాయిదుర్గారెడ్డి 6వ ర్యాంకు, హైదరాబాద్‌లో ఇంటర్‌ పూర్తిచేసిన అమలాపురానికి చెందిన కల్లకూరి సాయినాథ్‌ శ్రీమంత్‌ 10వ ర్యాంకు సాధించారు. అలానే వావిలాల చిద్విలాస్‌రెడ్డి 15, బిక్కిన అభినవ్‌చౌదరి 16వ ర్యాంకు సాధించారు. హైదరాబాద్‌కు చెందిన పొంగూరు భాను దివ్యాంగుల విభాగంలో 8వ ర్యాంకు సాధించాడు.100లోపు ర్యాంకుల్లో 30కిపైగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సాధించారు.

పెరిగిన కటాఫ్‌ స్కోర్‌ ఇలా..
జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించేందుకు, అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు ఈసారి కటాఫ్‌ స్కోర్‌ పెరిగింది. అతి తక్కువగా జనరల్‌ కేటగిరీలో, ఎక్కువగా ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో కటాఫ్‌ పెరిగినట్లు స్పష్టమవుతోంది. కోవిడ్‌ తర్వాత ప్రత్యక్ష తరగతులు జరగడంతో విద్యార్థుల మధ్య పోటీపెరిగి కటాఫ్‌ పెరిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జేఈఈ అర్హత సాధించినవారు ఈ రోజు నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్‌టీఏ ప్రకటించింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10