AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. హీనా ఖాన్‌ షాకింగ్‌ న్యూస్‌..

హిందీ బుల్లితెర నటి హీనా ఖాన్‌ తన అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. తాను స్టేజ్‌ 3 బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ప్రకటన విడుదల చేశారు. ‘హలో అందరికీ.. నన్ను ప్రేమించే, అభిమానించే ప్రతి ఒక్కరితో ఓ ముఖ్యమైన వార్తను పంచుకోవాలనుకుంటున్నాను. నేను స్టేజ్‌ 3 బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. అయినప్పటికీ నేను చాలా బలంగా ఉన్నాను. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను. ఆ దేవుడి దయ, కుటుంబసభ్యుల ఆశీస్సులతో నేను పూర్తి ఆరోగ్యంగా ఉంటానని నమ్ముతున్నాను’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. ఇది చూసిన పలువురు సెలబ్రిటీలు, అభిమానులు హీనా ఖాన్‌ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10