AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాలుగో యూనిట్‌ను సిద్ధం చేయాలి.. శ్రీశైలం విద్యుత్‌ కేంద్రం అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం

శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో అన్ని యూనిట్లను త్వరితగతిన సిద్ధం చేసి విద్యుత్‌ ఉత్పత్తి చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హైడల్‌ ప్రాజెక్టును ట్రాన్స్‌కో సీఎండీ రిజ్వీ, మాజీ సీఎంజీ హెచ్‌ అశోక్‌ కుమార్‌, హైడల్‌ డెరెక్టర్‌ వెంకట్‌రాజన్‌, సీఎంజీ హెచ్‌ఆర్‌ అజయ్‌తో కలిసి విద్యుత్‌ కేంద్రం సర్వీస్‌ బేలో పర్యటించారు. నాలుగో యూనిట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పొయిన అమరులకు నివాళులు అర్పించారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోపభూయిష్టమైన సాంకేతికతో రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చే నష్టాన్ని వివరించి ఎలాంటి పొరపాట్లు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కిందిస్థాయి ఉద్యోగుల నుంచి సీఈవో వరకు ఒకే కుటుంబంలా సమష్టి కృషి చేసి త్వరితగతిన నాల్గో యూనిట్‌ను సిద్ధం చేసి విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని సూచించారు. అనంతరం కాన్ఫ్‌రెన్స్‌ హాల్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. నాల్గో యూనిట్‌ పునరుద్ధరణకు కావాల్సిన రూ.2కోట్ల అంచనా వ్యయాన్ని మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 2006లో రికార్డు స్థాయిలో 26వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసిన విధంగా ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలని కోరారు. సమావేశంలో పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలల ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, కూచుకుల్ల రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, తుడి మేఘారెడ్డితోపాటు సంస్థ సీఈ సూర్యనారాయణ, ఎస్‌ఈ ఆదినారాయణ పాల్గొని పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10