AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

11,062 పోస్టులతో రేపు డీఎస్సీ నోటిఫికేషన్‌ !

నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్ వినిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. న్యాయస్థానాల్లో ఉన్న కేసులను పరిష్కరించి.. ఉద్యోగాల భర్తీకి ఉన్న అడ్డంకులు తొలగించామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రెండు నెలల్లోనే 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేసి.. ప్రతిపల్లెకు, తండాకు, గూడెంకు పంతుళ్లను పంపిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 11,062 పోస్టులతో గురువారం మెగా డీఎసీస నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది.

అయితే.. గత ప్రభుత్వంలో నిరుద్యోగుల గురించి కేసీఆర్ ఏరోజూ ఆలోచించలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేవలం తన కుటుంబసభ్యులకు మాత్రమే ఉద్యోగాలు ఇప్పించుకున్నాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. తన కూతురుని నిజామాబాద్‌లో ఓడగొడితే.. ఆరు నెలలు తిరగక ముందే మళ్లీ ఎమ్మెల్సీ పోస్టు ఇచ్చారని, ఇక వినోద్ రావును కూడా ప్రజలు తిరస్కరిస్తే ప్రణాళికా సంఘం ఉపాధ్యాకుడిగా నియమించారని.. ఇక సంతోష్ రావును రాజ్యసభకు పంపించారంటూ వివరించారు. కానీ.. పదేళ్లుగా పెళ్లిళ్లు చేసుకోకుండా చదివితే.. నోటిఫికేషన్లు లేక, ఉద్యోగాలు రాకా.. చెట్లకు ఉరేసుకుని చనిపోతుంటే ఏరోజూ కేసీఆర్ కానీ, కేసీఆర్ కానీ, కవిత గానీ స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.

కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే 25 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మార్చి మొదటి వారంలో మరో ఆరేడు వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు అందిస్తామని తెలిపారు. త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వేసి.. భారీ స్థాయిలో ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసి.. ప్రతి పల్లెకు, తండాకు, గూడెంకు పంతుళ్లను పంపిస్తామని హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్ హాయాంలో పోటీ పరీక్షల ప్రశ్నా పత్రాలు లీకవుతుంటే.. జిరాక్స్ సెంటర్లలో అమ్ముకుంటుంటే.. కేసీఆర్ పట్టించుకోలేదని దుయ్యబట్టారు రేవంత్ రెడ్డి. కానీ.. తమ ప్రభుత్వం వచ్చాక వాళ్లందరినీ జైళ్లకు పంపించామని తెలిపారు. కోర్టులో ఉన్న కేసులన్నింటినీ పరిష్కరించి.. ఉద్యోగాల భర్తీకి ఉన్న అడ్డంకులు తొలగించేలా చొరవ తీసుకున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. నిరుద్యోగుల కలలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తామని.. సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10