AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇక ఆ సిస్ట‌మ్‌తోనే ఎలక్ట్రిసిటీ బిల్లులు పేమెంట్స్.. ఎందుకంటే..?

మీరు ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్‌తో ఎలక్ట్రిసిటీ బిల్లులు పే చేస్తున్నారా.. అయితే, ఇక నుంచి అలా పేమెంట్స్ చేయడానికి కుదరదు. క్రెడిట్ కార్డు బిల్లుల పేమెంట్స్ మాదిరిగానే విద్యుత్ బిల్లుల చెల్లింపుల సేవలను ఈ యాప్స్ నిలిపేశాయి. ఈ మేరకు సౌత్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (టీజీఎస్పీడీసీఎల్) ఓ ప్రకటన చేస్తూ.. విద్యుత్ వినియోగదారులు ఇక నుంచి తమ వెబ్ సైట్ నుంచి గానీ, తమ మొబైల్ యాప్ నుంచి గానీ ఎలక్ట్రిసిటీ బిల్లులు పే చేయాలని సూచించింది. సదరు పేమెంట్స్ సంస్థలు ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని ఎలక్ట్రిసిటీ బిల్లులు నిలిపివేశాయని ఎక్స్ (మాజీ ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా తెలిపింది.

ఈ పరిస్థితి కేవలం సౌత్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీది మాత్రమే కాదు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని టీజీఎన్పీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ సంస్థలకూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సంస్థల పరిధిలోని కస్టమర్లు బిల్లులు చెల్లించడానికి ప్రయత్నించినప్పుడు భారత్ బిల్లు పేమెంట్ సిస్టమ్‌తో రిజిస్టర్ కాలేదని సందేశం వస్తోంది. దీనివల్ల భారీ సంఖ్యలో విద్యుత్ వినియోగదారులపై ప్రభావం పడనున్నది. ఇక నుంచి ఆయా ఎలక్ట్రిసిటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీల పరిధిలోని కస్టమర్లు తమ డిస్కమ్ వెబ్ సైట్ ద్వారా గానీ, మొబైల్ యాప్ ద్వారా గానీ విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది.

బీబీసీఎల్ ద్వారానే అన్ని రకాల పేమెంట్స్
భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారా మాత్రమే బిల్లుల చెల్లింపులన్నీ జరుగాలని ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. బిల్లుల పేమెంట్స్ లో సమర్థత, సెక్యూరిటీకి ప్రాధాన్యం ఇస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. దీని ప్రకారం కస్టమర్లు తమ బిల్లుల చెల్లింపునకు బీబీపీఎస్ ఎనేబుల్ చేసుకోవాలి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులు ఇంకా బీబీపీఎస్ ను యాక్టివేట్ చేసుకోలేదు. దీంతో కస్టమర్ల క్రెడిట్ కార్డుల బిల్లులను ఫోన్ పే, క్రెడ్ వంటి సంస్థలు ప్రాసెస్ చేయలేవు. దీనివల్ల సదరు మొబైల్ యాప్స్ లో క్రెడిట్ కార్డుల బిల్లుల పేమెంట్స్ జరుగదు. విద్యుత్ బిల్లుల చెల్లింపులకూ ఇదే పరిస్థితి ఎదురైందని భావిస్తున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10