AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్‌ చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్

టీ-20 ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. భారత జట్టు మూడోసారి ఫైనల్‌కు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై భారత్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా 2022 టీ20 ప్రపంచకప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.

ఇంగ్లండ్‌ను భారత్ 68 పరుగులతో తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. అనంతరం బౌలర్ల దెబ్బకు ఇంగ్లాండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లలో అక్షర్ పటేల్, కుల్దీప్ చెరో మూడు వికెట్లు, బుమ్రా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ నెల 29న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది.

గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ అర్ధసెంచరీతో ఇంగ్లండ్‌కు 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన టీమ్‌ఇండియా, ఆపై కుల్దీప్, అక్షర్‌ల బౌలింగ్‌తో ఇంగ్లిష్‌ జట్టును 16.4 ఓవర్లలో 103 పరుగులకే పెవిలియన్‌కు పంపింది.

కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కలిసి 6 మంది బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపారు. ఫిల్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్‌లను జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేశాడు. ఇద్దరు బ్యాటర్లు రనౌట్ అయ్యారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10