AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగించారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ మనీ లాండరింగ్‌ కేసులో జులై 25వ తేదీ వరకు కవిత, మనీష్‌ సిసోడియా కస్టడీ పొడిగిస్తున్నట్లు రౌస్‌ అవెన్యూ కోర్టు వెల్లడించింది.

ఈడీ కేసులో నేటితో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా జ్యూడిషిల్‌ కస్టడీ ముగిసింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కవిత, మనీష్‌ సిసోడియాను కోర్టు ముందు అధికారులు హాజరు పరిచారు. తదుపరి విచారణ జూలై 25వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా మూడు నెలల నుంచి కవిత తీహార్‌ జైల్లో ఉంటున్నారు.

ఢిల్లీ మద్యం విధానం కేసులో కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు రెండు రోజుల క్రితం తిరస్కరించిన సంగతి తెలిసిందే. సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో ఊరట ఇవ్వాలని, బెయిల్‌ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసిన రెండు పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. సీబీఐ, ఈడీ వాదనలతో న్యాయస్థానం ఏకీభవిస్తూ బెయిల్‌ను ఇవ్వలేమని చెప్పింది. హైకోర్టు బెయిల్‌ తిరస్కరించిన నేపథ్యంలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10