AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

త్వరలో గ్రూప్‌ 1 ప్రిలిమ్స్ ఫలితాలు.. మెయిన్స్‌కు ఎలా ఎంపిక చేస్తారంటే..

తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలపై బిగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఇటీవల జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలపై అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన ఓఎంఆఱ్ ఇమేజింగ్ షీట్ లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో అతి త్వరలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనే దానిపై అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది. అయితే 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఫలితాలను త్వరగా విడుదల చేయాలని కూడా టీజీపీఎస్సీ అధికారులు యోచిస్తున్నారు. జూలై మొదటి వారంలో ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ సారి మెయిన్స్ ను ఏ నిష్పత్తిలో ఎంపిక చేస్తారు అనేదే ఉత్కంఠగా మారింది. కాగా ఈ పరీక్షకు 3.02 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది. అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.

గ్రూప్ 1 మెయిన్స్‌కు 1:50కి ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనికి బదులుగా 1:100 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఇప్పటికే అభ్యర్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందించాలని కూడా కోరుతున్నారు.

అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్న వేళ టీజీపీఎస్సీ 1 : 50 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు జరిగే అవకాశం ఉంటుందని అందువల్ల ఏ విధంగా ఎంపిక చేయాలనే విషయంపై ప్రభుత్వం అధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల కాగానే మెయిన్స్ పరీక్షను నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో దీనికి సంబంధించిన షెడ్యూల్ ను కూడా ఇప్పటికే విడుదల చేశారు. మెయిన్స్ పరీక్షలో ఆరు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్షలో ప్రతీ పేపర్‌ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలను మధ్యాహ్నం 2. 30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్షను అన్ని భాషల్లో రాసేందుకు అభ్యర్థుల కోసం ఏర్పాటు చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10