AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శ్రీరాంసాగర్, జూరాలకు జలకళ.. ప్రాజెక్టులకు భారీగా వరద

ఎగువన కురుస్తున్న వర్షాలు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. తాజాగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌లోకి 17 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం1065.7 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సమార్థ్యం 80.5 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 16.405 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

జూరాలకు కొనసాగుతున్న వరద..
ఎగువన సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో గద్వాల జిల్లా ధరూర్‌ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 20 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి దిగువకు 27,877 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 318.516 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 315.850 అడుగులు ఉంది. జలాశయం నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.951 టీఎంసీలుగా ఉందని అధికారులు తెలిపారు.
అల్మట్టి ప్రాజెక్టుకు..
ఇక అల్మట్టి ప్రాజెక్టుకు 43,478 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 65,480 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 97.416 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, నీటిమట్టం 517.98 మీటర్ల వద్ద ఉన్నది. అల్మట్టి పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 123.081 టీఎంసీలు కాగా, నీటిమట్టం 519.60 మీటర్లు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10