AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మాట‌ల్లేవ్.. గూస్ బంప్సే.. కల్కి 2898 ఏడి హిస్టారికల్ బ్లాక్ బస్టర్..

హాలీవుడ్ రేంజ్ విజువల్స్..
ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ప్ర‌భాస్ (Prabhas) క‌ల్కి (Kalki 2898AD) చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 10 వేల‌కు పైగా స్క్రీన్ల‌లో గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. చాలా ప్రాంతాల్లో ప్ర‌త్యేక అనుమ‌తితో 6 షోలు కూడా ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే రెండో ఆట కూడా ప్రారంభ‌మైంది. ఈ నేప‌థ్యంలో రిలీజ్‌కు ముందు నుంచే సంచ‌ల‌నాలు, రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమాను ఇప్ప‌టికే చాలా మంది వీక్షించి త‌మ అభిప్రాయాలు తెలుపుతూ రివ్యూల‌ను ఇస్తున్నారు.

సినిమా గురించి నెటిజ‌న్లు ఏమంటున్నారంటే.. సినిమా ఆరంభం నుంచే ప్ర‌త్యేకంగా ఉంద‌ని, అమితాబ్ ఎంట్రీ, ఎలివేష‌న్స్ ఆ త‌ర్వాత ప్ర‌భాస్ ఎంట్రీతో సినిమా అమాంతం పీక్స్‌కు వెళ్లిందంటున్నారు. ముఖ్యంగా సినిమాలోని విజువ‌ల్స్ హాలీవుడ్ చిత్రాల‌ను త‌ల‌ద‌న్నేలా ఉన్నాయ‌ని, మార్వెల్‌, డ్యూన్ స్థాయిలో ఉన్నాయ‌ని కామెంట్లు చేస్తున్నారు. మ‌ధ్య‌లో రాంగోపాల్ వ‌ర్మ‌, విజ‌య్ దేవ‌రకొండ స‌ర్‌ప్రైజింగ్ ఎంట్రీస్ సినిమాను హైలెట్ చేసేలా ఉన్నాయంటున్నారు.

ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన చిత్రం కల్కి 2898 ఏడీ. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‏తో భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ మూవీపై ముందు నుంచి భారీ హైప్ నెలకొంది. భారతీయ పురాణాలు, ఇతిహాసాలను ఆధారంగా తీసుకుని సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తీసుకువస్తున్నట్లు గతంలో డైరెక్టర్ నాగ్ చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

వాటే ఏ విజన్.. వాటే ఏ క్లారిటీ.. నాగ్ అశ్విన్ పై ప్రశంసలు..
కల్కి 2898 ఏడీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన విజువల్ ప్రపంచాన్ని సృష్టించారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

కల్కి మూవీలో బుజ్జి కారు సెంటరాఫ్ ఎట్రాక్షన్
వల్డ్‌వైడ్‌గా కల్కి మూవీ రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. బొమ్మ హిట్ అంటూ కేరింతలు కొడుతున్నారు. తీన్మార్ స్టెప్పులతో సంబరాల్లో మునిగిపోయారు. ఇక..కల్కి మూవీలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ బుజ్జి. అదేనండి..హీరో ప్రభాస్ కారు. దాదాపు 7కోట్ల రూపాయల ఖర్చు చేసి కోయంబత్తూరులో స్పెషల్‌గా దాన్ని తయారు చేయించారు.

బెంగుళూరులోనూ కల్కి క్రేజ్..
హైదరాబాద్ లోని థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ హడావిడి మాములుగా లేదు. ప్రభాస్ కటౌట్స్, పోస్టర్స్ ఏర్పాటు చేసి పాలభిషేకాలు చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ డిజిటల్ కటౌట్స్ ఏర్పాటు చేసి డీజే పాటలతో హోరెత్తిస్తున్నారు.

కల్కి కోసం ప్రభాస్‏ను ఎంపిక చేసుకోవడానికి రీజన్ అదే..
కల్కి 2898 ఏడీ సినిమా ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ సందర్భంగా గతంలో డైరెక్టర్ నాగ్ అశ్వి్న్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. కల్కి సినిమా కథను ఇండస్ట్రీలో మరెవరు చేయలేరని.. అందుకే ప్రభాస్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు.

రాజమండ్రిలో కల్కి మేనియా
రాజమండ్రిలో కల్కి మేనియా నడుస్తోంది. సినిమా చూసిన ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. బాణసంచాలు కాలుస్తూ ప్రభాస్ అభిమానులు సందడి చేస్తున్నారు.

కల్కిలో కనిపించిన మరో ఐదుగురు..
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898 ఏడీ నేడు థియేటర్లలో విడుదలైంది. కాశీ, కాంప్లెక్స్, శంబల అనే మూడు ప్రపంచాలను పరిచయం చేస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన అద్భుత మాయ చిత్రానికి ఉదయం నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. ఇందులో కమల్ హసన్, అమితాబ్, దీపికా, శోభన, దిశా పటానీ, మాళవిక నాయర్ కీలకపాత్రలు పోషిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు మరో ఐదుగురు సినిమాలో కనిపించారు. మృణాల్, డైరెక్టర్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్ కెవి, ఫరియా అబ్దుల్లా కనిపించారు.

నార్త్‏లో కల్కి విశ్వరూపం..
పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కల్కి మేనియా కొనసాగుతుంది. ఈరోజు విడుదలైన ఈ సినిమాకు ఉదయం నుంచే పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ లో ఎవరూ ఊహించని రవిధంగా దూసుకెళ్తుంది కల్కి. పీవీఆర్, ఐనాక్స్, సినిపోలిస్ వంటి మల్టిప్లెక్స్ థియేటర్లలో ఏకంగా 1,25,000 టికెట్స్ విక్రయం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాదిలో అత్యధిక టికెట్స్ అమ్ముడైన సినిమాల్లో టాప్ 3 ప్లేస్ స్థానాన్ని దక్కించుకుంది ఈ మూవీ.

ప్రభాస్ ఫ్యాన్స్ క్రేజ్ క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్లు..
హైదరాబాద్‌లో థియేటర్ల దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ దగ్గర సందడి చేస్తున్నారు. డప్పుల దరువులతో సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. ఇప్పటికే హిట్ టాక్ రావడంతో ఇదే అదునుగా బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు కొందరు. టికెట్లను అధిక రేట్లకు పెంచేసి విక్రయిస్తున్నారు. సంధ్య థియేటర్ల ఫ్యాన్స్ జోష్‌.

ప్రభాస్ మానియా
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కల్కి థియేటర్ల వద్ద ప్రభాస్ మానియా సందడి కనిపిస్తోంది.. తెల్లవారుజామున బెనిఫిట్ షో చూసిన ప్రభాస్ అభిమానులు ప్రభాస్ కి మరో హిట్ అంటున్నారు.. హిస్టారికల్ నేపథ్యంలో తీసిన ఈ సినిమాలో గ్రాఫిక్స్ విజువలైజేషన్ అద్భుతంగా ఉన్నాయని ఆ కాలంలో జరిగిన యుద్ధాన్ని అద్భుతంగా చూపించారు అంటున్నారు ప్రేక్షకులు…. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా థియేటర్ల వద్ద సంబరాలు చేసుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10