AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దేశ ప్రజలకు శుభవార్త చెప్పిన నరేంద్రమోడీ .. వారికి కూడా ఆయుష్మాన్ భారత్

ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశ ప్రజలకు శుభవార్తను వినిపించారు. ఎన్నికల సమయంలో తాము మళ్లీ అధికారంలోకి వస్తే 70 సంవత్సరాలకు పైబడిన సీనియర్ సిటిజన్లను కూడా ఆయుష్మాన్ భారత్ పథకం కిందకు తీసుకువస్తామని ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 27న లోక్ సభలో మాట్లాడుతూ సీనియర్ సిటిజన్లు అందరికీ వైద్య సదుపాయన్ని అందజేస్తున్నట్లు తెలిపారు.

ఎన్డీయే ప్రభుత్వం 2018 సెప్టెంబరు 23వ తేదీన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఆర్థికంగా వెనకబడిన ప్రజలకు రూ.5 లక్షల్లోపు ఆరోగ్య బీమాను అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ పథకంలోని లబ్ధిదారులకు సంవత్సరానికి ఐదు లక్షల రూపాలయ విలువైన చికిత్స ఎంప్యానెల్డ్ ఆసుపత్రులద్వారా అందిస్తారు. ప్రస్తుతం 40 కోట్ల మంది ఈ పథకం కింద లబ్దిపొందుతున్నారు.

1350 వ్యాధులకు చికిత్స దేశ జనాభాలో 3.07 కోట్ల మంది లబ్దిదారులకు గోల్డెన్ కార్డును కేంద్రం జారీచేసింది. ఈ కార్డుద్వారా ప్రయివేటు ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స పొందొచ్చు. ఈ పథకం కింద వైద్య పరీక్షలతోపాటు చికిత్స అందివ్వడం, తర్వాత వైద్యులతో సంప్రదింపులు, ఔషధాలు, వైద్యానికి అవసరమయ్యే వస్తువులు, ఇంటెన్సివ్ కేర్ సేవలు, నాన్ ఇంటెన్సివ్ కేర్ సేవలు, క్లినికల్ సేవలు, ఆహార సేవలతోపాటు ఇతర సేవలు కూడా అందుతాయి. మొత్తం 1350 వ్యాధులకు చికిత్సనందిస్తున్నారు. Advertisement https://pmjay.gov.in/ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తెలియకపోతే ఎవరి సలహానైనా తీసుకోండి. తర్వాత మీకు దగ్గరలోని పబ్లిక్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ) లేదంటే మీసేవా కేంద్రానికి వెళ్లి అన్ని ఒరిజినల్ పత్రాలను, జిరాక్స్ కాపీలను సమర్పించండి. అక్కడ ఉంటే ఏజంట్ పత్రాలను ధ్రువీకరించి రిజిస్ట్రేషన్ ను నిర్థారించి కాపీని అందజేస్తారు. తర్వాత రెండువారాల్లోపు ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ వస్తుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10