AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పార్లమెంట్‌ సాక్షిగా రాహుల్‌ ఛాలెంజ్‌.. గుజరాత్‌లో బీజేపీని ఓడించి తీరుతాం..

– రాసిపెట్టుకోండి.. వచ్చే ఎన్నికల్లో గుజరాత్‌లో బీజేపీని ఓడించి తీరుతాం అంటూ సవాల్‌
– మోదీ సర్కార్‌పై రాహుల్‌ నిప్పులు
– లోక్‌సభలో హై టెన్షన్‌

(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
పార్లమెంట్‌ సమావేశాలు హాట్‌ హాట్‌గా సాగుతున్నాయి. లోక్‌ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి నేతల మధ్య మాటల తుటాలు పేలాయి. ఈ క్రమంలోనే లోక్‌ ప్రతిపక్షనేత, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. రాసి పెట్టుకోండి.. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో బీజేపీని ఓడిస్తామని పార్లమెంట్‌ సాక్షిగా రాహుల్‌ ఛాలెంజ్‌ చేశారు. ఉద్యోగాలు లేక దేశ యువతి అల్లాడుతోందని.. ఉద్యోగాలు ఇవ్వకుండా యువత వెన్ను విరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీ, ఐటీ విభాగాలు చిన్న, మధ్యతరగతి పరిశ్రమలే వేధిస్తున్నాయని ఫైర్‌ అయ్యారు. దేశంలోని బడా పారిశ్రామికవేత్తల కోసమే మోడీ సర్కార్‌ పని చేస్తోందని ధ్వజమెత్తారు.

మణిపూర్‌ అట్టుడుకుతుంటే..
రెండు వర్గాల మధ్య అల్లర్లతో మణిపూర్‌ అట్టుడికిపోతుంటే.. ప్రధాని మోడీ ఎందుకు ఇంత వరకు అక్కడికి వెళ్లలేదని ప్రశ్నించారు. మణిపూర్‌ను.. బీజేపీ దేశంలో అంతర్భాగంగా చూడడం లేదని విమర్శలు గుప్పించారు. తాను దేవుడితో నేరుగా మాట్లాడుతానని స్వయంగా మోదీనే చెప్పారు. నోట్లు రద్దు చేయాలని కూడా దేవుడే ఆయనకు చెప్పి ఉంటారని ఎద్దేవా చేశారు. దేశంలో అదానీ, అంబానీ చట్టాలే నడుస్తున్నాయని ఫైర్‌ అయ్యారు. ప్రొఫెషనల్‌ ఎగ్జామ్‌ అయినా నీట్‌ను కమర్షియల్‌గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ధనవంతుల పిల్లల కోసమే నీట్‌ పరీక్ష అని అన్నారు. దేశంలో తీవ్ర దుమారం రేపుతోన్న నీట్‌ పరీక్ష ప్రస్తావన రాష్ట్రపతి ప్రసంగంలో లేదని మండిపడ్డారు. రైతులు ఆందోళన చేస్తే వారిని పట్టించుకోకపోవడే కాకుండా.. పైగా వారిని ఉగ్రవాదులుగా చిత్రీకరించారని నిప్పులు చెరిగారు. బీజేపీ తెచ్చిన నల్లచట్టాల వలన 700 మంది రైతులు మరణించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారం కంటే నిజం గొప్పది..
అధికారం కంటే నిజం గొప్పదనే విషయం తెలుసుకోవాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నందుకు తాను సంతోషంగా ఉన్నాని… గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు. అధికార వికేంద్రీకరణ, సంపద వికేంద్రీకరణ, పేదలు, దళితులు, మైనార్టీలపై దౌర్జన్యాన్ని ప్రతిఘటించిన వారిని అణచివేశారని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఆదేశాలతోనే తనను విచారణ సంస్థలు విచారించాయన్నారు. ప్రతి మతం కూడా ధైర్యాన్ని బోధిస్తుందన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10