AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫాదర్స్ డే రోజు క్లీంకార కోసం రామ్ చరణ్ షాకింగ్ నిర్ణయం..

మెగా ఫ్యామిలీలోకి క్లీంకార వచ్చిన తర్వాత కుటుంబం అంతా మరింత హ్యాపీగా ఉంది. ఇక తండ్రిగా రామ్ చరణ్ ఆనందంతో పొంగిపోతున్నాడు. తండ్రి ప్రమోషన్ ని ఆస్వాదిస్తున్నాడు. ఇప్పటికే పలుమార్లు క్లీంకార ఫోటోలు బయట పెట్టినా ఎక్కడా ఫేస్ చూపించలేదు. రామ్ చరణ్ తండ్రిగా క్లీంకారకు ఎక్కువ సమయమే కేటాయిస్తున్నాడు. తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ నేషనల్ మీడియాకు ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.

చరణ్ ఈ ఇంటర్వ్యూలో తన సినిమాలు, తన ఫ్యామిలీ, తన కూతురు గురించి, తండ్రి అయ్యాక తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి.. ఇలా పలు ఆసక్తికర అంశాలు మాట్లాడాడు. అయితే ఈ క్రమంలో క్లీంకారకు సమయం ఇవ్వడం కోసం కొన్నాళ్ళు సినిమాలు స్లోగా చేస్తాను అని ఇండైరెక్ట్ గా చెప్పాడు చరణ్.

రామ్ చరణ్ మాట్లాడుతూ.. క్లీంకారని వదిలి వెళ్ళడానికి నాకు కష్టంగా ఉంది. తనకి నేను బానిస అయిపోయాను. షూటింగ్స్ కి వెళ్తే తనని నేను మిస్ అవుతున్నాను. ఇప్పటివరకు 15 ఏళ్లుగా కష్టపడ్డాను. టైమింగ్స్ పట్టించుకోకుండా షూటింగ్స్ చేశాను. కానీ ఇకపై నా కూతురికి సమయం ఇవ్వాలి అనుకుంటున్నాను. అందుకే లోకల్ లో షూటింగ్ ఉంటే మాత్రం సాయంత్రం 6 గంటలకు పూర్తి చేసేసి వస్తాను. నా నిర్మాతలకు కూడా ఈ విషయం ముందే చెప్తున్నాను. నా కూతురు స్కూల్ కి వెళ్ళేవరకు తనతోనే ఎక్కువ సమయం గడపాలి అనుకుంటున్నాను. దానికి తగ్గట్టే నా వర్క్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటాను అని తెలిపాడు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10