AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గుర్తు పెట్టుకోండి.. అన్ని రోజులు మీవే కావు.. ఏపీ మాజీ సీఎం జగన్‌ వార్నింగ్‌..

– ప్రజల ప్రతిస్పందన తప్పక ఉంటుంది

(అమ్మన్యూస్, నెల్లూరు):
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ టీడీపీ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. టీడీపీకి ఓటు వేయలేదనే కారణంతోనే ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు దొంగ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటివి ప్రోత్సహించ వద్దని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు గురించి ఫోకస్‌ చేయాలని కోరారు. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. గుర్తు పెట్టుకోవాలని.. అన్ని రోజులు మీవే కావంటూ జగన్‌ వ్యాఖ్యానించారు.

నెల్లూరు జైలులో పార్టీ నేత పిన్నెల్లిని మాజీ ముఖ్యమంత్రి జగన్‌ గురువారం పరామర్శించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద 307 సెక్షన్‌ కింద కేసు పెట్టారన్నారు. అన్యాయంగా జైల్లో నిర్బంధించారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవే కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వాళ్లే దాడి చేసి వైసీపీ నేతలు పై కేసులు పెడుతున్నారన్నారు. ఇంత దారుణంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ వివక్ష చూపలేదని గుర్తు చేసారు.

చంద్రబాబుపై వ్యాఖ్యలు
రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారని జగన్‌ ఆరోపించారు. వైయస్సార్‌ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారన్నారు. ఇలానే పరిస్థితి కొనసాగితే చంద్రబాబుకు బుద్ధి చెబుతారన్నారు. ప్రజలు ఎందుకు ఓటు వేశారు చంద్రబాబు ఆలోచించాలని సూచించారు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలని, పలానా మంచి చేశామని చెప్పి ఓటేయాలని కోరాలని కానీ, అన్యాయంగా దౌర్జన్యం చేయడం తగదన్నారు. ఇది తాత్కాలికమేనన్నారు. ఓటేసేటప్పుడు ప్రజలు అన్నీ గుర్తుపెట్టుకుంటారన్నారు. లెక్కా, జమా పెట్టుకొని ఓటేస్తారన్నారు.

బాబు మోసపూరిత హామీల వల్లే వైసీపీ ఓటమి..
వైసీపీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదని, మంచి చేసి ఓడిందన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో పది శాతం ఓట్లు అటుపడ్డాయన్నారు. రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారని, రైతు భరోసా ఇవ్వాలన్నారు. అమ్మ ఒడి కింద తాము రూ.15 వేలిస్తే, చంద్రబాబు ఎంత మంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారన్నారు. కోటిమందికి పైగా పిల్లలు స్కూళ్లకు వెళ్లేవారున్నారన్నారు. తల్లికి వందనం డబ్బులు అడుగుతున్నారన్నారని ఆ పని చేయాలన్నారు. 18 ఏళ్లు దాటిన అక్కచెల్లెమ్మలకు రూ. 1500 ఇవ్వాలని కోరారు. అలాంటి వాటిపై ధ్యాసపెట్టాలని జగన్‌ సూచించారు. దాడులను ప్రోత్సహించొద్దన్నారు. చంద్రబాబును తాను కోరడం లేదని హెచ్చరిస్తున్నానన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10